Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హసీనా ప్రతిపాదనను తిరస్కరించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

హసీనా ప్రతిపాదనను తిరస్కరించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాక్ తగిలింది. వచ్చే నెల డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వస్తానని ఆమె చేసిన ప్రతిపాదనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది.

తన ప్రయాణం కోసం ఢిల్లీ నుంచి ఢాకాకు విమానంతో పాటు ఇతర ప్రయాణ పత్రాలు ఏర్పాటు చేయాలన్న హసీనా విజ్ఞప్తిని ఆ దేశ ప్రభుత్వం నిరాకరించింది. దేశంలోకి అడుగుపెడితే వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

‘షేక్ హసీనా సాధారణ ప్రయాణికురాలు కాదు. కోర్టు శిక్షించిన నేరస్థురాలు. హసీనా వస్తే చేతులకు సంకెళ్లతో జైలుకు పంపుతాం. ఆమె బంగ్లా గడ్డపై అడుగుపెట్టిన వెంటనే అదుపులోకి తీసుకుని జైలుకు తరలిస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని ఆ ప్రకటనలో బంగ్లా ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. వచ్చే నెల బంగ్లాదేశ్ లిబరేషన్ డే అయిన 16న తాను తన స్వదేశానికి తిరిగి వెళ్తానని హసీనా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy