Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడటం తగ్గింది..

హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడటం తగ్గింది..

న్యూఢిల్లీ: అమెరికాలో నైపుణ్యాల కొరతను తీర్చడమే హెచ్‌-1బీ వీసా కార్యక్రమం అసలు ఉద్దేశమని, వీసా ఫీజు పెంపు ప్రతిపాదనను ఆ కోణంలోనే చూడాలని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ మంగళవారం పేర్కొంది.

అయితే ఇలాంటి వీసాలపై ఆధారపడటాన్ని భారతీయ టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే గణనీయంగా తగ్గించుకున్నాయని తెలిపింది. గత ఐదేళ్లలో భారతీయ కంపెనీలు అమెరికాలో స్థానికుల నియామకాలను క్రమంగా పెంచాయని పేర్కొంది. అమెరికాలో స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌)ను బలోపేతం చేసేందుకుగాను భారతీయ టెక్నాలజీ రంగం 110 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందని నాస్కామ్‌ గుర్తు చేసింది. ఇందులో భాగంగా 130కి పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో భాగస్వామ్యాలతో 29 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందటమే కాకుండా 2.55 లక్షలకు పైగా ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి చేకూరిందని తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy