హైదరాబాద్, జులై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్‌పై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Telangana CS Sanjay Jaju) ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
హెల్త్ కేర్ ట్రస్ట్ నిధుల సద్వినియోగంపై సంబంధిత అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పలు అశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత బలోపేతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. చికిత్స ప్యాకేజీ రేట్లపై సమగ్ర సమీక్ష జరపాలని ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ, సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా ఆస్పత్రుల సేవల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అత్యవసర వైద్య సేవలకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎస్ సంజయ్ జాజు మార్గనిర్దేశం చేశారు. 24 గంటల హెల్ప్ సిస్టమ్, వేగవంతమైన అనుమతి ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆలస్యం లేకుండా వెంటనే వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు. పారదర్శకంగా, సమర్థవంతంగా ఈ ట్రస్ట్‌ను నిర్వహించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు.
వార్తలు కూడా చదవండి...

