Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హెరిటేజ్ కేసు.. కన్నబాబు, అంబటిపై కోర్టు ఆగ్రహం

హెరిటేజ్ కేసు.. కన్నబాబు, అంబటిపై కోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: వైసీపీ నేతలపై హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటి వరకు విచారణకు హాజరుకాని వైసీపీ నేతలు కన్నబాబు, అంబటి రాంబాబుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 5న విచారణకు హాజరు కావాలని కన్నబాబు, అంబటి రాంబాబులను కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తు, రూ.5 వేలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.

అలాగే హెరిటేజ్ అధికారి సాంబమూర్తి కూడా విచారణకు హాజరుకావడం లేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 5న సాంబమూర్తి హాజరుకాకపోతే కేసు మూసివేస్తామని కోర్టు హెచ్చరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy