బంగారుపాళ్యం(చిత్తూరు): చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారం ఊపందుకుంది. శుక్రవారం టేబుల్ రకాలైన హిమామ్ పసంద్ టన్ను రూ.72 వేల నుంచి రూ.1.2 లక్షలు పలకగా కవరు కట్టిన బేనీషా రూ.35 వేల నుంచి రూ.42 వేలు, కవరు కట్టని బేనీషా రూ.16 వేల నుంచి 26 వేల వరకు ధర పలికింది.
నాణ్యమైన మల్గూబా టన్ను రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ధర పలికింది. కవరు కట్టిన మల్లిక టన్ను రూ. 25 వేల నుంచి 35 వేలు, కాలేపాడు రూ.25 వేల నుంచి 45 వేలు.. కవరు కట్టిన ఖాదర్ రకం రూ.40 వేల నుంచి 45 వేల రూపాయలు,
గుజ్జు పరిశ్రమకు తరలించే ఖాదర్ రకం టన్ను రూ.18వేలు.. చందూరా రూ.7వేల నుంచి రూ.15వేలకు అమ్ముడుపోయింది. గుజ్జు పరిశ్రమకు తరలించే తోతాపురి టన్ను రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. నేరుగా ఫ్యాక్టరీలకు తరలిస్తే రూ.7 వేలు ఇస్తున్నట్లు రైతులు చెప్పారు. టేబుల్ వెరైటీలను కొనడానికి ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొంటున్నారు.
/span>
అత్యాచారం కేసు.. పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ..
Read Latest AP News And Telangana News And International News And Telugu News

