కడప (క్రైం), జనవరి 21 : జిల్లా బి.కేటగిరి హోంగార్డుల ఎత్తు అర్హత పరీక్షకు రెండోరోజైన గురువారం 1572 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. ఇందు లో 1526 మంది అర్హత సాధిం చారన్నారు. గురువారం ఎత్తు పరీక్షకు గైర్హాజరైన అభ్యర్థులు తిరిగి 22, 23, 24 తేదీల్లో హాజరు కావాలని తెలిపారు. దళారుల మాటలు నమ్మొద్దని, కేవలం ఎంపిక ప్రక్రియ, ప్రతిభ ఆధారంగానే జరుగుతుందన్నారు.
