Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హోటల్‌లో అగ్ని ప్రమాదం.. 9మంది మృతి

హోటల్‌లో అగ్ని ప్రమాదం.. 9మంది మృతి

  • ఆరుగురికి తీవ్ర గాయాలు.. కోల్‌కతాలో ఘటన

కోల్‌కతా, ఆగస్టు 19: పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్‌ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బంగ్లాదేశ్‌ పౌరులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సుమారు 80మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ప్రతి అంతస్తులో నాలుగైదు హోటళ్లు నడుస్తున్నాయని.. గాలి, వెలుతురు లేని ఇరుకైన గదులే ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్‌ చౌదరి పేర్కొన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము ఎక్స్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy