
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరుణా వోరా తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. దీనిలో ఆయనకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తెలిపారు.
ఇటీవలి కాలంలో తనతో టచ్‌లో ఉన్నవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. కాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవవ్రత్ సింగ్‌కు కూడా కరోనా సోకినట్లు స్పష్టమైంది. దీంతో ఆయన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మార్చి 2 వరకూ బడ్జెట్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
ఈ నేపధ్యంలో పలువురు మంత్రులు వీరిని కలుసుకున్నారు. దీంతో వీరంతా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇదిలావుండగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గడచిన ఆరు రోజులుగా ఒక్క కరోనా మృతి కూడా నమోదు కాలేదు.