Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇద్దరు మంత్రులు టచ్‌లో ఉన్నారు.. కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇద్దరు మంత్రులు టచ్‌లో ఉన్నారు.. కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయపార్టీ అవసరముందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేవారు. అటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తాను, ఈటల మరికొంత మంది ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కేసీఆర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. కేసీఆర్‌ కేబినెట్‌లోని మరో ఇద్దరు మంత్రులు తమతో టచ్‌లో ఉన్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌పై పోరాటం చేసే పరిస్థితిలో కాంగ్రెస్‌, బీజేపీలు లేవన్నారు. తమ ఆలోచనలకు రేవంత్‌రెడ్డి మద్దతు కూడా ఉందని చెప్పారు. మరో రెండు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించారు.

షర్మిలకు తెలంగాణలో రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని అనుకోవడంలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy