Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

  • 15 నుంచి లబ్ధిదారులకు పంపిణీ

  • జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 2,57,815

హనుమకొండ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్డ్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి జిల్లా పౌర సరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది.

స్మార్ట్‌ కార్డు విషయంలో దాదాపు 8 నెలల నుంచి ప్రభుత్వం చేసిన ఆలోచన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. జిల్లాల వారిగా స్మార్డ్‌ కార్డు పంపిణీ అంశంపై శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌర సర ఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లాలో కార్డులు, లబ్దిదారుల సంఖ్య, బియ్యం కోటా సరఫరా తదితర అంశాలను జిల్లా అధికారులు మంత్రికి వివరించారు.

15 నుంచి లబ్ధిదారుల చేతికి..

స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు. అదేరోజున మిగతా జిల్లాల్లో కూడా ప్రజా ప్రతినిధులు కార్డుల పంపిణీని లాంఛనంగా చేపడతా రు. అయితే పంపిణీ వేదికలు, ఏర్పాట్లు తదితర అంశా లపై ఈనెల 11 వరకు స్పష్టత రానుంది. స్మార్ట్‌ రేషన్‌ కార్డు ఆకర్షణీయంగా ఉండనుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు సైజులో ఈజీగా వాలెట్‌లో పెట్టుకు నేలా ప్రభుత్వం రూపొందించింది.

ఆధునిక సాంకేతిక విలువాలతో కార్డు ఆకర్షణీయంగా ఉంటుందని అధికా రులు అంటున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం రేషన్‌కార్డుల సంఖ్య 2,57,815. ఈ మేరకు స్మార్ట్‌ కార్డులు పంపిణీ కానున్నాయి. మూడు నెలల కిందట రేషన్‌ కార్డులు సంఖ్య 2,28,651. కొత్తగా 29,164 కార్డులు మంజూరు అయ్యాయి. దీంతో కార్డుల సంఖ్య 2,57,815కు చేరింది. కొత్త కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియ కావడంతో కార్డుల సంఖ్య పెరుగు తూనే ఉంటుంది.

 4874.027 మెట్రిక్‌ టన్నుల బియ్యం కోటా

జిల్లాలో మొత్తంగా రేషన్‌ షాపుల సంఖ్య 414. మొత్తం రేషన్‌కార్డులు 2,57,815. లబ్ధిదారుల సంఖ్య 7,75,274. ఈ మేరకు హనుమకొండ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కోటా 4874.027. మూడు నెలల కిందట ఉన్న కార్డుల సంఖ్య 2,28,651 మేరకు బియ్యం కోటా 4257.292 మెట్రిక్‌ టన్నుల బియ్యం. కొత్తగా 29,164 కార్డులు పెరగడంతో 616.735 మెట్రిక్‌ టన్నుల పంపిణీ కోటా పెరగింది. మొత్తంగా హనుమకొండ జిల్లాలో 4874.027 మెట్రిక్‌ టన్నుల బియ్యం కోటా రేషన్‌ షాపులకు పంపిణీ అవుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy