Dailyhunt
ఇలా చేయడం కక్షసాధింపు కాదా?: అశోక్‌బాబు

ఇలా చేయడం కక్షసాధింపు కాదా?: అశోక్‌బాబు

విజయవాడ: సచివాలయ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేదని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్క్‌ఫ్రమ్ హోమ్‌పై సీఎం జగన్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు దాదాపు 10మంది ఉద్యోగులు మృతిచెందారని చెప్పారు. సీఎం, మంత్రులు ఇంట్లో ఉంటూ.. ఉద్యోగులను కార్యాలయానికి రావాలనడం కక్షసాధింపు కాదా? అని అశోక్‌బాబు ప్రశ్నించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy