నెలలుగా లబ్ధిదారుల ఎదురుచూపు
గృహప్రవేశం చేసినా ఖాతా ల్లో జమ చేయని నగదు
పీఎంఏవై-జీ నిఽధులు వస్తేనే బిల్లులు అందే అవకాశం
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ టౌన్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇం దిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా జిల్లాకు 18,163 ఇళ్లను మంజూరు చేసింది.
దీంతో లబ్ధిదారు లు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా, పునాది, లెంటల్, స్లాబ్ దశలు పూర్తిచేసిన వాటికి బిల్లుల విడుదల ఆలస్యమవుతోంది. కొందరు లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించి న నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేసి, గృహప్రవేశాలు కూడా చేశారు. చివరి విడత బిల్లు కోసం నెలల తరబడిగా నిరీక్షిస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.1.60లక్ష ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో సుమారు రూ.65కోట్లు బకాయి విడుదల కావాల్సి ఉంది.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా చివరి బిల్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, నిఽధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అప్పుచేసి ఇళ్ల నిర్మాణం
ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థి క సాయం అందిస్తోంది. అయితే, నిర్మాణ సామ గ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చు అధికమవడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మిం చి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు ప్రైవేట్ గా అప్పు చేయగా, కొందరు చిట్టీలు వేసి మరికొందరు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఇం టి నిర్మాణాన్ని పూర్తిచేశారు. చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసినా తుది విడత బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం పూర్తయినట్టు నమోదు చేసినా, నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. కొం దరు చెల్లింపుల కోసం మూడు నుంచి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూడు విడతల బిల్లులు రూ.3.40లక్షలు మాత్ర మే రాగా, చివరి విడత రూ.1.60లక్షలు పీఎంఏవైజీ కింద చెల్లించాల్సి ఉంది. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో లబ్ధిదారులకు అప్పుల భా రం పెరుగుతోంది. ఒక్కో ఇంటికి ప్రభుత్వం అం దించే రూ.5లక్షలతో పాటు మరో రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు లబ్ధిదారులు అదనంగా వెచ్చించి నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు ఇలా..
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో తొలి విడత 18,163 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 15,323 ఇళ్లకు మార్క్ ఔట్ చేసి నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించారు. వాటిలో ఇప్పటివరకు సుమారు 7,634 ఇళ్ల నిర్మాణాలు స్లాబ్‌లెవల్ వరు పూర్తయ్యాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినప్పటికీ తుది బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 4,073 మంది లబ్ధిదారులకు ఫైనల్ బిల్లుగా నాలుగో విడత డబ్బులు మంజూరు కాలేదు. ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ.1.60లక్షల చొప్పున జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.65కోట్ల మేర బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. మరోవైపు 11,250 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
నిధులు రాగానే బిల్లులు చెల్లిస్తాం: ఎల్.లోకీలాల్, హౌసింగ్ పీడీ
జిల్లాలో ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు చివరి బిల్లు సుమారు ఒక్కొక్కరికి రూ.1.60లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా చివరి బిల్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున నిధులు విడుదల కాగానే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు వివిద దశల్లో ఉన్న ఇళ్లను స్థానిక అధికారుల పరిశీలన చేసిన అనంతరం డబ్బు జమచేశాం.
నియోజకవర్గం మంజూరైన బేస్‌మెంట్ రూఫ్ ఆర్‌సీ పూర్త ప్రారంభం
ఇళ్లు లెవల్ లెవల్ లెవల్ యినవి కానివి
నల్లగొండ 3,357 443 271 1,420 771 452
మిర్యాలగూడ 3,133 350 276 1,524 706 277
నాగార్జునసాగర్ 3,285 414 227 1,348 849 447
దేవరకొండ 3,274 494 250 1,269 561 700
మునుగోడు 1,972 232 107 752 497 384
నకిరేకల్ 2,639 297 170 1,069 582 521
తుంగతుర్తి 503 64 21 252 107 59
మొత్తం 18,163 2,294 1,322 7,694 4,073 2,840

