Dailyhunt
ఇంకా టీఎంసీలోనే ఉన్నాను : రాజీవ్ బెనర్జీ

ఇంకా టీఎంసీలోనే ఉన్నాను : రాజీవ్ బెనర్జీ

కోల్‌కతా : ప్రస్తుతానికైతే తాను టీఎంసీలోనే ఉన్నానని తాజాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజీవ్ బెనర్జీ పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది మాత్రం అప్పటి పరిణామాలను బట్టి ఉంటుందని తెలిపారు. అయితే ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయనని ఆయన ప్రకటించారు. ''నేను పార్టీ కార్యకర్తగా ఉంటాను. ఓ ఎమ్మెల్యేగా భవిష్యత్‌లో ఏం జరుగుతుందన్నది మాత్రం చెప్పలేను. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుంది.'' అని రాజీవ్ బెనర్జీ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy