Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటింటికీ ఇంటర్నెట్‌: సీఎం జగన్‌

ఇంటింటికీ ఇంటర్నెట్‌: సీఎం జగన్‌

అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశించారు. ఇంటర్నెట్‌ కనెక్షన్లు, అమ్మఒడి పథకంపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ''అంతరాయాలు లేని ఇంటర్నెట్‌ ఏర్పాటు లక్ష్యం కావాలి. ప్రతి గ్రామానికి అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలి. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలి'' అని ఆదేశించారు. అమ్మఒడి, వసతి దీవెన లబ్ధిదారుల్లో కోరుకున్నవారికి ల్యాప్‌టాప్‌ అందించడంపైనా సమీక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy