Dailyhunt
IPL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..

IPL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2026కు సంబంధించిన రెండో విడత షెడ్యూల్ బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు 12 వేదికల్లో జరగనున్నాయి.

ఈ లీగ్ రెండవ దశ తొలి మ్యాచ్ ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ మధ్య జరగనుంది. మే 24న కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరిగే వేదికలు, తేదీలను తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.

కొద్ది రోజుల క్రితమే తొలి దశ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 28 నుంచి ప్రారంభ ఏప్రిల్ 12 వరకు మొత్త 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండో దశలో 50 మ్యాచ్‌లు కలిపి మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండో దశలో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్ లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. రెండో దశ మ్యాచ్‌లకు బెంగళూరు, ముంబై చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ , అహ్మదాబాద్, హైదరాబాద్, లఖ్‌నవూ, జైపూర్, ధర్మశాల, రాయపూర్, చండీగఢ్ వేదికలు కానున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy