Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ ముందున్న మంచి మార్గం అదొక్కటే: అధ్యక్షుడు పెజెష్కియాన్

ఇరాన్ ముందున్న మంచి మార్గం అదొక్కటే: అధ్యక్షుడు పెజెష్కియాన్

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం యూఎస్‌తో గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుకు సాగడమే తమ ముందు ఉన్న గొప్ప మార్గమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు.

అవగాహన ఒప్పందం గడువు గత వారమే ముగిసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఆంక్షలకు మద్దతు ఇచ్చే పొరుగు దేశాలకు చుక్కలు చూపిస్తామని ఇరాన్ టాప్ భద్రతా అధికారి వార్నింగ్ ఇచ్చిన తరుణంలో పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

యుద్ధం, ప్రశాంతత రెండూ లేని నేటి స్థితి నుంచి బయటపడేందుకు యూఎస్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒక్కటే తమ ముందున్న మంచి మార్గమాని పెజెష్కియాన్ అన్నారు. ఆ ఒప్పందంలోని ఏ ఒక్క అంశం ఇరాన్‌ను లొంగిపోయినట్టుగా చూపించట్లేదని భరోసా ఇచ్చారు. సుప్రీం లీడర్ ఎంపిక చేసిన విధానాలు, మార్గంలోనే తాము ముందుకు వెళుతున్నామని చెప్పారు. యుద్ధ వాతావరణం కారణంగా ఇరాన్‌లో విదేశీ పెట్టుబడులు నిలిచిపోయాయని చెప్పారు.

పశ్చిమాసియాలో యుద్ధాన్ని 60 రోజుల్లోపు కట్టిపెట్టేలా చర్చలు జరిపేందుకు యూఎస్, ఇరాన్‌లు గతంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ తరువాత పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఒప్పందాన్ని పక్కనపెట్టేశాయి.

ఇదిలా ఉంటే, యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సోమవారం ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌ను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు మునుపెన్నడూ చూడని స్థాయిలో ఆంక్షలు ఉండబోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఇక చర్చలను పునఃప్రారంభించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా సోమవారం ఇరాన్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy