Dailyhunt
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..

ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..

యుద్ధం మొదలైన తొలి రోజునే అగ్ర నాయకత్వాన్ని కోల్పోయినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను ఇరాన్ ధీటుగా ఎదుర్కొని ప్రపంచాన్ని అబ్బురపరిచింది. అధికారాలను, బాధ్యతలను ఎక్కడికక్కడ వికేంద్రీకరించడంతో అన్ని విభాగాలు చక్కటి సమన్వయంతో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఎదురుదాడికి దిగాయని విశ్లేషణలు వినిపించాయి.

అయితే ప్రస్తుతం ఇరాన్ నాయకులు, కీలక అధికారుల మధ్య అంతర్గత విభేదాలు మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి (Iran leadership crisis).

ఇటీవల మొజ్తబా ఖమేనీకి కొందరు నాయకులు, అధికారులు పంపిన ఒక రహస్య లేఖ వెలుగులోకి రావడంతో, ఇరాన్ నాయకత్వంలో విభేదాలు ఉన్నట్టు బహిర్గతమైంది. ప్రస్తుతం ఇరాన్‌లో ముఖ్యంగా రెండు వర్గాలు కనిపిస్తున్నాయి. మొదటి వర్గం.. కఠిన వైఖరి ఉన్న అతివాదులు. రెండో వర్గం.. చర్చలకు సిద్ధంగా ఉన్న మితవాదులు. అమెరికాతో చర్చల విషయంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారట. ప్రస్తుతం కీలక నిర్ణయాలు ఐఆర్‌జీసీ చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం (Mojtaba Khamenei letter).

అతివాదులు, మితవాదుల మధ్య అణు ఒప్పందంపై తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఇరాన్ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, అణు సమస్యపై అమెరికాతో తీవ్రంగా చర్చలు జరపడం తప్ప మరో మార్గం లేదని ఖమేనికి రాసిన రహస్య లేఖలో మితవాదులు పేర్కొన్నారు. ఆ లేఖలో మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, ముస్తఫా పౌర్‌ మొహమ్మది వంటి ప్రముఖుల సంతకాలు ఉన్నట్లు సమాచారం. ఈ కీలక నాయకులు అమెరికాతో చర్చలు సాగించాలని కోరుకుంటున్నారు (Iran nuclear talks dispute).

మరోవైపు అమెరికా డిమాండ్లకు తలొగ్గకూడదని, అణు కార్యక్రమంపై ముందుకు వెళ్లాలని ఐఆర్‌జీసీ సహా అతివాద వర్గాలు భావిస్తున్నాయట (Iran internal divisions). అమెరికాతో చర్చలు జరపాలా లేక ఘర్షణను కొనసాగించాలా అనే విషయంలో నాయకత్వంలో పెరుగుతున్న విభేదాలను తాజా లేఖ బహిర్గతం చేసింది.

strong>

కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత..

ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా: కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy