Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇషా  పసిడి గురి

ఇషా పసిడి గురి

  • 25 మీ. పిస్టల్‌లో స్వర్ణం

  • మనూ కాంస్యానికే పరిమితం

  • షూటింగ్‌ ప్రపంచ కప్‌

హాంగ్‌ఝౌ (చైనా): భారత వర్ధమాన షూటర్‌ ఇషాసింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మెరిసింది.

ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌ కప్‌ షూటింగ్‌ మహిళల 25మీ. పిస్టల్‌ విభాగంలో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. ఈక్రమంలో ఒలింపిక్‌ పతక విజేత మనూ భాకర్‌కు హైదరాబాదీ షాకిచ్చింది. దాంతో స్టార్‌ షూటర్‌ మనూ కాంస్యానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఎనిమిదిమంది షూటర్లు తలపడిన సోమవారంనాటి 25 మీ. పిస్టల్‌ ఈవెంట్‌ హోరాహోరీగా సాగింది. అయితే 21 ఏళ్ల ఇషా అమోఘమైన ప్రదర్శన చేసి 40 హిట్లు నమోదు చేయడం ద్వారా పసిడి పతకం సొంతం చేసుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనూభాకర్‌ (28 హిట్లు) కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. చైనాకు చెందిన జాంగ్‌ (37) రజత పతకం నెగ్గింది. అంతకుముందు క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మనూభాకర్‌ (586-20ఎక్స్‌)టా్‌పలో నిలిచింది. ఇషా (585-18ఎక్స్‌) రెండో స్థానం దక్కించుకుంది. ఈ సీజన్‌లో ఇషాసింగ్‌కిది రెండో స్వర్ణం కావడం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy