Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జడేజా అదిరిపోయే కామెడీ.. నవ్వు ఆపుకోలేకపోయిన కోచ్ గంభీర్!

జడేజా అదిరిపోయే కామెడీ.. నవ్వు ఆపుకోలేకపోయిన కోచ్ గంభీర్!

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరద కామెడీతో అందరినీ నవ్విస్తూ మైదానంలో సందడి చేశాడు.

మ్యాచ్ రెండో రోజున జడేజా తన సహచర స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను సరదాగా అనుకురించాడు. జడ్డు చేసిన ఈ విన్యాసం కెమెరా కంట పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో కుల్దీప్ బౌలింగ్ చేసే సమయంలో పరిగెత్తుకు వచ్చే విధానం, ముఖ కవళికలను జడేజా అద్భుతంగా ఇమిటేట్ చేశాడు. జడ్డు చేసిన ఈ విచిత్ర విన్యాసానికి అక్కడే ఉన్నవారంతా నవ్వుకున్నారు. ముఖ్యంగా డగ్‌అవుట్‌లో కూర్చొన్న టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ సరదా దృశ్యాన్ని చూసి తన నవ్వును ఆపుకోలేకపోయాడు. కామెంటేటర్ కూడా ఈ చమత్కార ఘటనపై స్పందిస్తూ.. 'రవీంద్ర జడేజా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను కాపీ చేస్తున్నాడు. అతడి ముఖ కవళికలు చూడండి సరిగ్గా కుల్దీప్‌లాగే కనిపిస్తున్నాయి. అలానే అతడు బౌలింగ్ కోసం పరిగెత్తిన విధానం కుల్దీప్ లానే చేశాడు' అంటూ వ్యాఖ్యానించాడు.

ఈ వీడియోపై క్రికెట్ అభిమానులు పలు రకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జడ్డు ఎక్కడ ఉంటే.. సరదా వాతావరణం సందడిగా ఉంటుందంటూ ప్రశంసిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి357 పరుగులు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy