అమరావతి: న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన కేసుపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుపై విచారణ జరిపిన సీబీఐ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కనీసం ఒక్క నోటీసు కూడ ఇవ్వలేక పోయారని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు నోటీసులు ఇవ్వాలని.. ప్రభాకర్ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణ శుక్రవారం నాటికి వాయిదా వేసింది. అలాగే రేపు హైకోర్టుకు సీబీఐ ఎస్పీ రావాలని, ఎటువంటి చర్యలు తీసుకున్నది చెప్పాలని స్పష్టం చేసింది.

