Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగదీష్‌రెడ్డికి జగ్గారెడ్డి వార్నింగ్

జగదీష్‌రెడ్డికి జగ్గారెడ్డి వార్నింగ్

హైదరాబాద్: మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ విస్కీలో సోడాలు కలిపే నీవా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. తాము తలుచుకుంటే జగదీష్‌రెడ్డి తిరగగలడా? అని ప్రశ్నించారు. జగదీష్‌రెడ్డి పేరుకు కరెంట్‌ మినిస్టర్‌.. ఆయన దగ్గర పవర్‌ లేదని ఎద్దేవాచేశారు. తెలంగాణ ఇవ్వకపోతే జగదీష్‌రెడ్డి ఎవరు అని నిలదీశారు. జగదీష్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని జగ్గారెడ్డి హెచ్చరించారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy