Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ దుశ్చర్యలకు కోడెల బలైయ్యారు: నక్కా ఆనందబాబు

జగన్ దుశ్చర్యలకు కోడెల బలైయ్యారు: నక్కా ఆనందబాబు

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ దుశ్చర్యలకు కోడెల శివప్రసాదరావు బలైయ్యారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కోడెల రెండవ వర్థంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో కోడెల ముందు..

కోడెల తర్వాత అనే చర్చ ఉంటుందన్నారు. పల్నాడులోని ఫ్యాక్షన్, అహంకార రాజకీయాలను మార్చివేశారన్నారు. కోడెల రాష్ట్రానికి ఓ బ్రాండ్ అని, ఏ శాఖకు మంత్రిగా పనిచేసినా.. దానికి వన్నె తెచ్చారని కొనియాడారు.

గ్రామ స్థాయి నుంచి ప్రతి టీడీపీ కార్యకర్తను వైసీపీ వేధిస్తోందని మండిపడ్డారు. జగన్ సీఎం అయిన మూడు నెలలకే కోడెలను చంపారని ఆరోపించారు. ఆ కసి తీర్చుకోవాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈనాటి ఉత్సాహం ఎన్నికల వరకు కొనసాగాలన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్త కసితో పని చేసి సత్తెనపల్లి, నరసరావుపేటలలో టీడీపీని గెలిపించాలని నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy