Dailyhunt
జగన్ పన్నాగానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: అచ్చెన్న

జగన్ పన్నాగానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: అచ్చెన్న

అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ నియామకంపై ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టడం హర్షణీయమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ట్రస్ట్ పరిధిలోని ఆస్తులు, భూములను.. జగన్ రెడ్డి పన్నిన పన్నాగానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇన్నిసార్లు కోర్టులతో తలంటించుకొన్న పరిస్థితి లేదన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. మొట్టికాయలు తప్పవు జగన్‌రెడ్డి అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy