ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
జగన్‌కు వంగలపూడి అనిత బహిరంగ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ నేత వంగలపూడి అనిత బహిరంగ లేఖ రాశారు. ''మీ పాలనలో మహిళలకు జరిగిన అన్యాయాలపై సాక్ష్యాధారాలతో బహిరంగ చర్చకు సిద్ధం. మీ రెండేళ్ల పాలనలో మహిళలకు జరిగిన న్యాయం ఒక్కటైనా ఉందా?. సంపూర్ణ మద్యపాన నిషేధమంటే మిమ్మల్ని నమ్మి మహిళలు ఓట్లేశారు. కానీ మీరు మద్యాన్ని ఏరులై పారించడమే కాక.. నాశిరకం మద్యం అమ్ముతూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటామాడుతున్నారు. అమ్మఒడితో రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డితో రూ.36వేలు లాక్కుంటున్నారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్ ఇస్తానని హామీనిచ్చి నట్టేట ముంచావు. దిశ'' చట్టం ఆమోదించిన రోజే గుంటూరులో ఐదేళ్ల బాలికపై వైసీపీకి చెందిన లక్ష్మణరెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆడపడుచులకు ఇంత క్షోభ మిగిల్చిన మీకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే హక్కు లేదు'' అని వంగలపూడి అనిత హెచ్చరించారు.