తొలి రోజు ఆటలో సహనం కోల్పోయిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ధాటిగా ఆడుతున్న అతడిని 17వ ఓవర్‌లో పేసర్ అసిత ఫెర్నాండో బౌల్డ్ చేశాడు.
దీంతో జైస్వాల్ నిరాశగా క్రీజును వీడుతున్న సమయంలో అసిత కవ్వించాడు. వెంటనే కోపంతో వెనక్కి వచ్చిన జైస్వాల్ నేరుగా అసిత మీదికి వెళ్లాడు. అంతేకాకుండా తన హెల్మెట్ ముందుభాగాన్ని అసిత నుదిటికి ఆనించి నెట్టడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే లంక కెప్టెన్ ధనంజయ వేగంగా స్పందించి జైస్వాల్‌ను పక్కకు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. కానీ జైస్వాల్ ప్రవర్తన ఐసీసీ రూల్ ఆఫ్ కండర్ట్ లెవెల్ 1ను అతిక్రమించినట్టు అవుతుంది. దీని ప్రకారం ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతంజరిమానాతో పాటు 1 లేదా 2 డీమెరిట్ పాయింట్లు పడే అవకాశం ఉంది. టెస్టు ముగిశాక ఇద్దరు ఆటగాళ్లను విచారణకు పిలిచి రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

