Monday, 20 Jan, 7.27 am ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
జల్లికట్టు ఎద్దు 'మాతృప్రేమ'

చెన్నై, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పొంగల్‌ సందర్భంగా తమిళనాట జల్లికట్టు, రెక్లా పందాలు, మంజువిరట్టు (ఎద్దులను వదిలే పోటీలు) జోరుగా సాగాయి. ఆ క్రమంలో శివగంగ జిల్లా సిరావయల్‌ ప్రాంతంలో నిర్వహించిన మంజువిరట్టు పోటీల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. పోటీలో భాగంగా వదిలిన ఎద్దు రంకెలేసుకుంటూ ముందుకు ఉరికింది. వేగంగా పరిగెడుతూ దూసుకుపోతోంది.

ఆ సమయంలో అనుకోని విధంగా చంటిబిడ్డని ఎత్తుకుని, మరోచేత్తో కుమారుడ్ని పట్టుకుని ఒక మాతృమూర్తి అడ్డుగా వచ్చింది. అది చూసిన జనం ఆ ఎద్దు వారిని ఢీకొట్టి తన కొమ్ములతో విసిరికొట్టేస్తుందేమోనని భయంతో చూస్తున్నారు. కానీ, ఆ తల్లీబిడ్డలను చూడగానే ఎద్దుకి ఏమైందోగానీ ఠక్కున ఆవేశాన్ని తగ్గించుకుని తల్లీబిడ్డలను ఢీకొనకుండా వారి పై నుంచి ఎగిరి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. దాంతో ఆ తల్లీబిడ్డలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ దృశ్యం చూసిన జనం ఆశ్చర్యకితులయ్యారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top