Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేన యువజన విభాగం 'జై కొట్టు'.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ

జనసేన యువజన విభాగం 'జై కొట్టు'.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ

కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 2: జనసేన పార్టీ యువజన విభాగానికి 'జై కొట్టు' అనే పేరును ఖరారు చేశారు. ఈరోజు(బుధవారం) కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 'జై కొట్టు' లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.

యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత రెండు మూడు నెలలుగా ఆరోగ్య సమస్యల కారణంగా పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. నియంత జగన్‌ను ఎదుర్కొని కూటమి విజయానికి జనసేన పనిచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy