Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

జంతువుల నుంచే మనుషులకు కరోనా !!

బ్రిస్బేన్‌, సెప్టెంబరు 25 : కరోనా వైరస్‌ పుట్టుక అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీయే. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

కరోనా వ్యాప్తి మొదలవడానికి చాలా నెలల కిందటే.. జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ పలుమార్లు సంక్రమించి ఉండొచ్చని వారు తెలిపారు. అయితే ఇది ఎక్కడ జరిగింది ? ఎలా జరిగింది ? అనే దానిపై కచ్చితమైన ఆధారాలేవీ లేవని స్పష్టం చేశారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 2019 డిసెంబరు నుంచి 2020 ప్రథమార్ధం వరకు కొవిడ్‌ బారినపడిన వారి రక్త నమూనాలను సేకరించి విశ్లేషించారు.

వాటి జన్యుక్రమాలను విశ్లేషించగా అప్పట్లో ప్రధానంగా 2 రకాల కరోనా వేరియంట్లే ప్రబలినట్లు నిర్ధారణ అయింది. ఈ వైరస్‌ వేరియంట్ల జెనెటిక్‌ కోడ్‌లలో రెండు వేర్వురు చోట్లలో న్యూక్లియోటైడ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ ల్యాబ్‌ నుంచే వైరస్‌ లీకై ఉంటే.. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తొలినాళ్లలోనే ఈవిధంగా రెండు వేరియంట్లు వ్యాప్తిలోకి వచ్చి ఉండేవి కావని ప్రాథమిక అధ్యయన నివేదికలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వూహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకేజీ జరిగి ఉండకపోవచ్చనే సంకేతాన్ని ఇచ్చేలా ఈ నివేదిక ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy