Dailyhunt
జర్నలిస్ట్‌లు కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇలా చేయండి..

జర్నలిస్ట్‌లు కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇలా చేయండి..

హైదరాబాద్ : ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కొవిడ్‌ టీకా కార్యక్రమం సోమవారం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చే సీనియర్‌ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు 70 మందికి తొలి డోస్‌ టీకా వేశారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎస్‌.విజయ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టులు డాక్టర్‌ కె.రామచంద్రమూర్తి, దుర్గాకుమార్‌, రాధా శివమోహన్‌, వీరేంద్ర కపర్తి, రాంలాల్‌, ప్రసాద్‌ బోసేకర్‌, సన్యాసిరావు, ఎన్‌.భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరో మూడు రోజులపాటు జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్‌ వేయనున్నారు.

8374452215కు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రతిరోజూ వంద మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy