Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జేఎన్‌టీయూలో ఇక పక్కాగా హాజరు లెక్క!

జేఎన్‌టీయూలో ఇక పక్కాగా హాజరు లెక్క!

  • ఫేస్‌ రికగ్నేషన్‌ వ్యవస్థ ద్వారా విద్యార్థులతో పాటు

  • బోధన, బోధనేతర సిబ్బంది హాజరు నమోదు

  • క్లౌడ్‌ ఆధారిత వ్యవస్థతో అవకతవకలకు చెక్‌: డైరెక్టర్‌ కామాక్షి ప్రసాద్‌

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరు లెక్క, ఇకపై పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టాలని వైస్‌చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. వీసీ ఆదేశాల మేరకు ఫేషియల్‌ రికగ్నేషన్‌ ద్వారా అటెండెన్స్‌ సిస్టమ్‌ వైపు వర్సిటీ ఉన్నతాధికారులు మొగ్గుచూపారు. బుధవారం కొన్ని సాంకేతిక సంస్థలతో సంప్రదింపులు జరిపిన అనంతరం అత్యుత్తమైన విధానాలను అవలంబిస్తున్న కన్జార్టియం ఈ బాధ్యతలను అప్పగించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు.

జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న 11 ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అఫిలియేషన్‌ కలిగిన 250కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లోనూ ఈ విధానాన్ని మూడు దశల్లో అమల్లోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. తొలివిడతగా జేఎన్‌టీయూ హైదరాబాద్‌ క్యాంప్‌సతో పాటు అనుబంధ కళాశాలలైన సుల్తాన్‌పూర్‌, మంథని, జగిత్యాల, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్‌, వనపర్తి, కోస్గి ఇంజనీరింగ్‌ కాలేజీలు, సుల్తాన్‌పూర్‌లోని ఫార్మసీ, క్యాంప్‌సలోని మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో సెప్టెంబరు 1నుంచి ఫేసియల్‌ రికగ్నేషన్‌ సిస్టమ్‌ అమలు చేయాలని నిర్ణయించారు.

 రెండోదశలో ప్రైవేటు అటానమస్‌, మూడోదశలో ప్రైవేటు అఫిలియేటెడ్‌ కాలేజీలకు విస్తరించనున్నట్లు తెలిసింది. నూతనంగా ఏర్పాటు చేయబోయే క్లౌడ్‌ ఆధారిత హాజరు వ్యవస్థ అమలుతో విద్యార్థుల, అధ్యాపకుల హాజరు నమోదులో అవకతవకలకు చెక్‌ పెట్టినట్లు అవుతుందని యూనివర్సిటీ అకాడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్‌ కామాక్షి ప్రసాద్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy