ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు

అనంతపురం: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అనుమతి లేదంటూ మెయిన్ బజార్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై జేసీ ప్రభాకరరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రచారాన్ని అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై జేసీ కన్నీరు పెట్టారు. నిన్నటి వరకు ఉన్న మైక్, వెహికల్ పర్మిషన్ ఈ రోజు ఎందుకు లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఓటర్ల వద్దకు వెళ్తానని.. ఎవరికీ భయపడే భయపడే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకే రక్షణ లేదని ఇక మరి వైసీపీకి ఓటేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
related stories
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు సీఎం జగన్కు వామపక్షాల లేఖ
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు పరీక్షలపై సీఎం జగన్ కీలక ప్రకటన
-
హోమ్ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతధం : జగన్