Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జియో నుండి ఐదు సరికొత్త డేటా ప్లాన్‌లు..

జియో నుండి ఐదు సరికొత్త డేటా ప్లాన్‌లు..

ముంబై : రిలయన్స్ జియో సరికొత్త డేటా ప్లాన్ ఆఫర్లు ప్రకటించింది. ఇవి రూ. 22 నుండి ప్రారంభమై, రూ. 152 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్స్ అన్నీ కూడా 28 రోజుల కాలపరిమితివే. కొన్ని ప్లాన్స్ డెయిలీ హైస్పీడ్ క్యాప్, మరికొన్ని ఆఫర్లు డేటా బెనిఫిట్స్‌తో ఉన్నాయి. వివరాలిలా ఉన్నాయి.

డేటా ప్యాక్స్ ఇవీ...

ఈ డేటా ప్లాన్‌లు రూ. 22, రూ. 52, రూ. 72, రూ. 102, రూ. 152 ధరలతో ఉన్నాయి. మొత్తం ఐదు డేటా ప్లాన్స్‌ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చాయి. వివరాలిలా ఉన్నాయి.

1) రూ. 22 ప్యాక్ - 2జీబీ డేటా - 28 రోజుల కాలపరిమితి,

2) రూ. 52 ప్యాక్ - 6జీబీ డేటా - 28 రోజుల కాలపరిమితి,

3) రూ.

72 ప్యాక్ - ప్రతిరోజు 0.5జీబీ డేటా - 28 రోజుల కాలపరిమితి,

4) రూ. 102 ప్యాక్ - ప్రతిరోజు 1జీబీ డేటా - 28 రోజుల కాలపరిమితి,

డెయిలీ లిమిట్ తర్వాత...

ఈ ఆఫర్లను 28 రోజుల కాలపరిమితితో అందిస్తోంది జియో. డెయిలీ ఎఫ్‌యూపీ అనంతరం ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్ కు పడిపోతుంది. కిందటి వారం రూ. 749 తో ప్రత్యేక వార్షికప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత ఈ డేటా ప్యాక్‌లను ప్రకటించడం గమనార్హం. ఈ ప్యాక్‌ల్లో జియో యాప్స్‌ను ఉచితంగా అందిస్తోంది. అయితే కాల్స్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు మాత్రం లేవు.

కొత్త కస్టమర్ల కోసం...

జియో గతవారం జియో ఫోన్ యూజర్ల కోసం రూ. 749 యాన్యువల్ ప్లాన్‌ను ప్రకటించింది. అలాగే కొత్త కస్టమర్లకు రూ. 1999, రూ. 1,499 ప్లాన్స్ తీసుకు వచ్చింది. కాగా, తాజా 5 డేటా ప్లాన్స్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో న్యూస్ వంటి జియో యాప్స్‌కు యాక్సెస్ కావొచ్చు. రూ. 72 ప్లాన్‌లో రోజుకు 6.5 జీబీ చొప్పున 28 రోజులకు 14 జీబీ వస్తుంది. రూ. 102 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ చొప్పున 28 రోజులకు 28 జీబీ డేటా సౌలభ్యముంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy