Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

తొలి మూడు నెలల్లో రూ.24,928 కోట్ల సమీకరణ

  • త్వరలో 8 పీఎ్‌సయూల నుంచి ఓఎ్‌ఫఎ్‌సలు

  • జాబితాలో ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌

  • బడ్జెట్‌ లక్ష్యాన్ని మించనున్న డిజిన్వెస్ట్‌మెంట్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిధుల కొరతతో అల్లాడుతోంది. ఖర్చులు పెరిగినంతగా రాబడులు పెరగడం లేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్‌సయూ) ప్రైవేటీరణ జోరు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి మూడు నెలల్లోనే పీఎ్‌సయూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.24,923 కోట్లు సమీకరించింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో తొలి మూడు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం ఎన్నడూ ఇంత మొత్తాన్ని సమీకరించలేదు. ఇందులో గత ఆరు వారాల్లోనే ఆరు పీఎ్‌సయూలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా రూ.18,561 కోట్లు సమీకరించాయి. ప్రభుత్వ రంగం లోని మౌలిక ప్రాజెక్టులు ఇన్విట్స్‌ ద్వారా మరో రూ.6,367 కోట్లు సమీకరించాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం బడ్జెట్‌లో పేర్కొన్న రూ.80,000 కోట్లను మించి పోతుందని భావిస్తున్నారు.

త్వరలో మరిన్ని సంస్థల్లో వాటాల విక్రయం: పశ్చిమాసియా సంక్షోభంతో గత మూడు నెలలుగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. అయినా ఇన్వెస్టర్ల నుంచి పీఎ్‌సయూల ఓఎ్‌ఫఎ్‌సలకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో త్వరలో ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంకుతో పాటు ఎనిమిది పీఎ్‌సయూలు ఓఎ్‌ఫఎ్‌సకు సిద్ధమవుతున్నాయి. ఈ ఇష్యూలకు మదుపరుల స్పందన ఎలా ఉంటుంది? షేర్ల ధర, ఎప్పుడు మార్కెట్‌కు వస్తే మదుపరుల నుంచి మంచి స్పందన లభిస్తుంది? అనే విషయాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ప్రతి వారం ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్లతో సమావేశమై చర్చిస్తున్నట్టు సమాచారం. త్వరలో మార్కెట్‌కు వచ్చే ఎల్‌ఐసీ ఓఎ్‌ఫఎస్‌ ద్వారానే ప్రభుత్వ ఖజానాకు రూ.10,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని అంచనా. వేదాంత గ్రూప్‌ కంపెనీ హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌) ఈక్విటీలో ప్రభుత్వానికి ఉన్న మైనారిటీ వాటా అమ్మకం ద్వారా మరో రూ.5,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటికి తోడు కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తనకు ఉన్న మెజారిటీ వాటాను మరింత తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఎందుకంటే?

అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో భారత ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముడి చమురు ధర భారీగా పెరగటంతో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ అమ్మకాలపై ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గత నెలాఖరుకు ఈ నష్టాలు రూ.74,781 కోట్లకు చేరినట్టు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి గురువారం వెల్లడించారు. ఎరువుల వంటి కీలక దిగుమతులూ పెద్ద గుదిబండగా మారాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఎరువుల సబ్సిడీ భారమే రూ.3 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. బడ్జెట్‌ అంచనాల కంటే ఇది దాదాపు రెట్టింపు. మరోవైపు పన్ను వసూళ్ల వృద్ది రేటూ అంత ఆశాజనకంగా లేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటును జీడీపీలో 4.3 శాతం వద్ద కట్టడి చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎ్‌సయూల పెట్టుబడుల ఉపసంహరణ వేగం పెంచడం ఒక్కటే మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది.

మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy