Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వ్యాపారవేత్త ఇంట్లో వజ్రాభరణాలు మాయం

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వ్యాపారవేత్త ఇంట్లో వజ్రాభరణాలు మాయం

హైదరాబాద్, సెప్టెంబర్ 02: నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ చోరీ కలకలం రేపింది. రోడ్డు నెంబర్ 10లో రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త నీల్ కౌర్ నివసిస్తున్నారు.

ఆయన ఇంట్లో దుండగుడు చొరబడి భారీగా వజ్రా భరణాలతోపాటు బంగారు నగలు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 10 తులాలకుపైగా బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు ఆ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. వాటిలో ఎమరాల్డ్ ఉంగరం, బ్రాస్లెట్లు, నెక్లెస్‌లు, చెవి కమ్మలు సహా ఇతర ఆభరణాలు ఉన్నాయని వివరించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. కౌర్ నివాసంలో ఎవరూ లేకపోవడంతో వెనుక భాగం నుంచి దుండగుడు ఇంట్లోకి చొరబడినట్లు సీసీటీవీల ద్వారా పోలీసులు గుర్తించారు. కిటికీ గ్రిల్స్ తొలగించి.. ఇంట్లోకి ప్రవేశించినట్లు కనుగొన్నారు. అంతకుముందు మరో రెండు ఇళ్లలో చోరీ చేసేందుకు సదరు దుండగుడు ప్రయత్నించాడు. అయితే ఆ ఇంటి యజమానులు మెల్కోని ఉండడంతో అతడు వెనక్కి వచ్చినట్లు సీసీ టీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. వ్యాపారవేత్త ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చోరీకి దుండగుడు ఎంచుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రహదారిపై కారు ఆపి నిద్రపోయాడు.. కారణం తెలిస్తే అవాక్కవాల్సిందే.. వీడియో వైరల్

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy