Dailyhunt
జూబ్లీహిల్స్‌లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడిన జంట  అరెస్ట్

జూబ్లీహిల్స్‌లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడిన జంట అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 19: జూబ్లీహిల్స్ చైన్ స్నాచింగ్‌కి పాల్పడిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంట ఆంధ్రప్రదేశ్‌ పారిపోతుంటే.. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వీరిని పోలీసులు గుర్తించి..

అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు విచారించారు. జల్సాల కోసం ప్రియుడితో కలిసి ఆమె ఈ పనులకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఆమె వయస్సు 33, అతడి వయస్సు 23 అని విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

హైదరాబాద్‌ మాదాపూర్‌లో హాస్టల్‌లో నివాసం ఉంటున్న కె. మానస జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 39లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తోంది. మంగళవారం (17-02-2026) ఉదయం హాస్టల్‌ నుంచి ఆఫీసుకు రోడ్డుపై నడుచుకుంటూవెళ్తోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెం 44 వద్దకు ఆమె రాగానే.. ఎదురుగా యాక్టివా బైక్‌పై వచ్చిన యువకుడు బండిని అకస్మా్తుగా ఆపేశాడు. ఆ బండిపై వెనుక సీట్ల ఉన్న యువతి మానస మెడలోని బంగారు గొలుసు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితురాలు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఘటన స్థలంలో సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌లను సేకరించి.. అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. ఇక తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద తనిఖీల్లో భాగంగా పోలీసులకు ఈ జంట పట్టుబడ్డారు.


కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

For More TG News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy