Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

జూనియర్‌ డాక్టర్లతో కొలిక్కిరాని చర్చలు

విజయవాడ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో ప్రాణాలకు తెగించి వైద్యసేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ ఏపీ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌కు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. వైద్యఆరోగ్యశాఖ అధికారులు జూడాలతో చర్చలు జరుపుతున్నారు. ఆదివారం రాత్రి విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జూనియర్‌ డాక్టర్లు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy