కామారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హోసింగ్ బోర్డ్ కాలనీలో కరోనా కలకలం సృష్టించింది. హోసింగ్ బోర్డ్ కాలనీలో కరోనా పాజిటివ్ వ్యక్తిని తన ఇంటికి రాకుండా కాలనీ వాసులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. పోలీస్, వైద్య సిబ్బంది నచ్చజెప్పినా కాలనీ వాసులు మొండికేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి తన సొంత ఇంట్లోకి వెళ్లకుండా రోడ్డుపైనే ఉన్నారు.

