Tuesday, 18 Feb, 2.03 pm ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
కారు లభ్యం కేసు: రాధ మేడమ్‌ ఫోన్‌ నుంచి కాల్ చేశారు: గుమ్మస్తా నర్సింగ్

కరీంనగర్‌: కాకతీయ కెనాల్‌లో లభ్యమైన కారులో ఎమ్మెల్యే సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణరెడ్డి, కుమార్తె మృతదేహాలు దొరికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్యానారాయణరెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో సత్యనారాయణరెడ్డి షాపు గుమ్మస్తా నర్సింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడాడు. గత నెల 26న సత్యనారాయణ ఫోన్‌ను రీచార్జ్‌ చేశానని వెల్లడించాడు. 'రాధ మేడమ్‌ ఫోన్‌ నుంచి కాల్ చేశారు. 27న డబ్బులు వచ్చాయా అని నేనే ఫోన్‌ చేశా. వచ్చాయి అని ఫోన్‌ పెట్టేశారు' అని నర్సింగ్ తెలిపాడు. ఎక్కడికి వెళ్లినా వారం లోపే వచ్చే వారని.. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేస్తే.. వెదుకుతున్నామని చెప్పారని నర్సింగ్‌ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top