Dailyhunt
కార్వీకి ఈడీ షాక్.. రూ.700 కోట్ల షేర్‌లను ఫ్రీజ్ చేసిన ఈడీ

కార్వీకి ఈడీ షాక్.. రూ.700 కోట్ల షేర్‌లను ఫ్రీజ్ చేసిన ఈడీ

హైదరాబాద్: కార్వి కేసులో ఈడి దూకుడు ప్రదర్శిస్తోంది. 3000 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.

ఇటీవల హైదరాబాద్, గుంటూరులలో పార్థసారధి ఇల్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కార్వి హెడ్ ఆఫీస్‌లో 10 గంటల పాటు సోదాలు నిర్వహించింది. షేర్‌లను ఫ్రీజ్ చేయాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. పార్థసారధి, అతని కుమారులు రజట్ పార్థసారథి, అధిరజ్ పార్థసారధిలకు సంబంధించిన షేర్‌లను అధికారులు ఫ్రీజ్ చేయనున్నారు. కార్వికి సంబంధించిన 700 కోట్ల రూపాయల షేర్‌లను ఈడీ ఫ్రీజ్ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy