Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

మరావతి, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రేపు (గురువారం) 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరుగనుంది.

జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు (గురువారం), ఎల్లుండి (శుక్రవారం) రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు.

జీఎస్డీపీ, సూపర్ సిక్స్, తాగునీరు, గృహనిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్‌పై మొదటిరోజు ముఖ్యమంత్రి చర్చించనున్నారు. రెండోరోజు ఈ- గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర నిధుల వినియోగంతో పాటు పలు అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగాధిపతులు పాల్గొననున్నారు.

7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల నివేదికతోనే మొదటి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆర్థిక వృద్ధి, సంక్షేమం, మానవాభివృద్ధి, సాంకేతికత, పెట్టుబడులు, శాంతిభద్రతలు లాంటి కీలక విభాగాల వారీగా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. అలాగే ప్రభుత్వ సేవలు, వివిధ పథకాల అమలు వంటి వాటిపై క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్లకు సీఎం మార్గనిర్దేశం చేస్తారు.

రెండు రోజులు.. 19 అంశాలపై సమీక్ష..

మొదటి రోజున జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర విజన్‌కు జిల్లాస్థాయి రోడ్‌మ్యాప్‌లపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్యారంగంలో పురోగతి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్ సదస్సులో పలువురు కలెక్టర్లు ప్రదర్శిస్తారు. రెండో రోజు సదస్సులో ఈ- గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, జిల్లాల వారీగా ర్యాంకింగ్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, శాంతిభద్రతలపై సమీక్షించి అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేయనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy