Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ వాక్సిన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదే విధంగా టెస్టులు, కోవిడ్‌ ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని సూచించారు. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తప్పనిసరిగా వాక్సిన్‌ వేయాలన్నారు. ఎక్కడా కూడా కోవిడ్‌ వాక్సిన్‌ను వృథా చేయొద్దని జగన్‌ వెల్లడించారు. కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, మెడికేషన్, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంచాలని వారికి జగన్ సూచించారు. ఇవన్నీ మన బాధ్యత అన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచిత వైద్య సేవలందించాలన్నారు. ఐసొలేషన్‌కు ప్రత్యేక గది లేకపోతే, రోగిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలన్నారు. రోగులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. రోగిని ఎప్పటికప్పుడు చెక్‌ చేయడం కూడా మన బాధ్యతగా భావించాలని ఆయన పేర్కొన్నారు. 104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలని వారికి ఆయన సూచించారు. కోవిడ్‌ సమస్యలకు ఈ నెంబరు ఏకైక గమ్యంగా ఉండాలని జగన్ పేర్కొన్నారు. గ్రీవెన్స్‌ కోసం కేటాయించిన 1902 నెంబర్‌ను అటెండ్‌ చేయాలన్నారు. ఏ సమస్యపై ఫిర్యాదు వచ్చినా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy