Dailyhunt
కళ్యాణ్ దేవ్‌కి కోవిడ్ పాజిటివ్..!

కళ్యాణ్ దేవ్‌కి కోవిడ్ పాజిటివ్..!

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌.. తనకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో బుధవారం కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకున్నట్టు తెలిపిన కళ్యాణ్ దేవ్.. తాజాగా పాజిటివ్‌ అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హాస్పిటల్‌లోనే క్వారంటైన్ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే మరింత స్ట్రాంగ్‌గా, ఆరోగ్యంగా తిరిగి వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానుల ప్రేమకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy