కుట్టుమిషన్ల పథకంపై అవగాహన కల్పించండి : మంత్రి పొన్నం
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు స్టే ఎత్తివేసిన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
పెండింగ్‌లో ఉన్న కల్యాణ లక్ష్మి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. 2023-26 మధ్య వచ్చిన కల్యాణ లక్ష్మి దరఖాస్తులు, క్లియర్ చేసిన చెక్కులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కుట్టు మిషన్ల పథకం దరఖాస్తులు, ప్రొక్యూర్‌మెంట్, టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కుట్టు మిషన్ల కోసం ఇప్పటివరకు వివిధ జిల్లాల నుంచి 1,80,170 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 15 వరకు కొనసాగుతుందని అధికారులు మంత్రికి వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..

