Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కందుల కొనుగోలుకు రాష్ట్రం నిధులివ్వలేదు

కందుల కొనుగోలుకు రాష్ట్రం నిధులివ్వలేదు

కేంద్రం 51,626 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది

మరో లక్ష టన్నుల కొనుగోలుకు సిద్ధంగా ఉంది: కిషన్‌రెడ్డి

బేగంపేట, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కందుల ఉత్పత్తిని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కంది రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించకపోగా, ఒక్క టన్ను కందులను కూడా కొనుగోలు చేయలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 51,626 మెట్రిక్‌ టన్నుల కందులను కొనుగోలు చేసిందని, మరో లక్ష టన్నులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ఆదివారం దిల్‌కుష్‌ గెస్ట్‌హౌ్‌సలో నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో కంది రైతుల పరిస్థితిని గుర్తించి కేంద్రం టన్ను కందులకు 5,800 రూపాయలు చెల్లించి నాఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని కేంద్రం సీసీఐ ద్వారా కొనుగోలు చేసిందని తెలిపారు. కరోనా నివారణకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy