పెందుర్తి(విశాఖపట్నం) ఆగస్టు 9: కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తండ్రే.. లోకం పోకడ తెలియని, మతిస్థిమితం లేని కన్న కూతురిపై కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. బాధితురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. పెందుర్తి సీఐ అశోక్‌కుమార్ కథనం ప్రకారం.. వేపగుంట సమీప గ్రామంలో తాపీమేస్ర్తి(55) కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్దకుమార్తెలిద్దరికీ వివాహాలయ్యాయి. రెండో కుమార్తెకు భర్తతో విభేదాలు రావడంతో కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటోంది. మూడో కుమార్తె(17)కు మతిస్థిమితం లేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు.
