Dailyhunt
కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేస్తున్న సంస్థ

కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేస్తున్న సంస్థ

మహబూబ్‌నగర్: కరోనా మహమ్మారి బంధుత్వాలను ప్రశ్నార్థకంలోకి నెట్టివేస్తోంది. కరోనాతో చనిపోతే.. ఎంత ఆస్తి.. అంతస్తు ఉన్నా దిక్కులేని శవాలుగా మారిపోతున్నారు. పాడి మోసేందుకు, పూడ్చేందుకు నలుగురు మనుషులు కరువైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలో మేమున్నామంటూ పాలమూరు మైనారిటీ యువత ముందుకొచ్చింది. మహబూబ్‌నగర్ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పడి ఎవరూ ముందుకు రాని మృతదేహాల అంతిమ సంస్కారాలు చేస్తూ పుణ్యం కట్టుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy