Tuesday, 10 Mar, 10.33 am ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
'కరోనా' నిరోధానికి జిల్లాలవారీగా నిఘా కమిటీలు

చెన్నై(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రబలకుండా తగు ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరంగా చేపట్టేందుకుగాను జిల్లాల వారీగా నిఘా కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఆ నిఘా కమిటీలకు నాయకత్వం వహిస్తారని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. రాష్ట్రంలో ఇరువురికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆ వైరస్‌ ప్రబలకుండా తగు జాగ్రత్తలు వహించేందుకు, ఆరోగ్య శాఖ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేందుకు గాను ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఎడప్పాడి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయంలో శాసనసభ సమావేశం వాయిదాపడిన తర్వాత ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్య మంత్రి పన్నీర్‌సెల్వం, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, మంత్రులు డి. జయకుమార్‌, కేఏ సెంగోటయ్యన్‌, వేలుమణి, ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనో వైరస్‌ గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడే సంత లు, మాల్స్‌, సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థలు, సూపర్‌ మార్కెట్లు తదితర ప్రాంతాల్లో కరోనా వైరస్‌పై అవగాహన ప్రచార కార్యక్రమాలు జరపాలని, వీలైతే కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయాలని ఎడప్పాడి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా కేంద్రాల్లోని వైద్యకళాశాలలకు చెందిన ప్రధాన ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా బాధితులకు చికిత్సలం దించేందుకు ప్రత్యేక వార్డులను సిద్ధంగా ఉంచాలని, చికిత్సకు సంబంధించి మందుల కొరత లేకుండా చూడా లని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ కరోనా వైరస్‌ ప్రబల కుండా వుండేలా ఐఏఎస్‌ అధికారుల నాయక త్వంలో నిఘా కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలు జిల్లా అంతటా పర్యటించి ఆరోగ్యశాఖ అధికారులు అవగాహన ప్రచారాలు నిర్వహించేలా, అవస రమైనవారికి చికిత్సలు అందించేలా ఎప్పటికప్పుడు పరిశీ లించి జిల్లా కలెక్టర్లకు రోజువారీ సమాచారాలను అందించాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పేర్కొన్నారు.

వదంతులు నమ్మొద్దు: మంత్రి విజయభాస్కర్‌

ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ గురించి సామాజిక ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌పై తప్పుడు సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో వ్యాపింపజేస్తే పోలీసు శాఖ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన చర్యలు గురించి ఆయన చెన్నైలోని డీఎంఎస్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా అన్ని జిల్లాల్లోని ఆరోగ్యశాఖ అధికారులతో సోమవారం ఉదయం సమీక్ష జరిపారు. కరోనా వైరస్‌ నిరోధక చర్యలు చేపట్టేందుకు ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలుతోందని సామాజిక ప్రసార మాధ్యమాల్లో తప్పుడు సమాచారాలను వ్యాపింప చేస్తు న్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంచీపురానికి చెందిన ఇంజనీర్‌కు మాత్రమే కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. చెన్నై జనరల్‌ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో ఆయనకు ఉన్నతమైన చికిత్సలను వైద్యులు అందిస్తున్నారని తెలిపారు.

సచివాలయం వద్ద కరపత్రాల పంపిణీ

కరోనా వైరస్‌పై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సమీక్షాసమావేశం నిర్వహిస్తున్నప్పుడే సచివాలయం వద్ద ఆరోగ్యకార్యకర్తలు ఆ వైరస్‌ గురించి అవగాహన కల్పిం చేలా కరపత్రాలను పంపిణీ చేశారు. శాసనసభ సమా వేశం ముగిసి వెలుపలికి వస్తున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు, శాసన సభ్యులకు ఆరోగ్యశాఖ మహిళా కార్యకర్తలు కరప త్రాలను అందజేశారు. ఇదేవిధంగా కొందరు శాసన సభ్యులకు కరోనా వైరస్‌ రాకుండా చేతులు కడిగే విధా నాన్ని కూడా వారు ప్రదర్శించారు.

స్కూళ్ళలో బయోమెట్రిక్‌ హజరు రద్దు

కరోనా వైరస్‌ నిరోధక చర్యలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రధానో పాధ్యాయులకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు రోజూ డ్యూటీ ప్రారంభ సమయంలో బయోమెట్రిక్‌ పరికరంపై వేలి ముద్రను పొందుపరిచి తమ హాజరును ధ్రువీకరిం చుకుంటారు. ఈ పద్ధతి వల్ల కరోనా వైరస్‌ ప్రబలే అవకాశం ఉందని తెలియడంతో విద్యాశాఖ స్కూళ్ళలో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని రద్దు చేసింది.

కరోనా వైరస్‌ ప్రభావం వల్ల చెన్నై విమానాశ్రయానికి వచ్చి వెళ్లే పది విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా, ఇండికో, కువైట్‌ ఎయిర్‌వేస్‌, కాథే పసిఫిక్‌ సంస్థలు కువైట్‌, హాంకాంగ్‌, ఇటలీ, ఇరాన్‌ తదితర ప్రాంతాల నుండి చెన్నైకి వచ్చి వెళ్లే ఈ విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top