Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరోనా వస్తే అక్టోబర్‌లోనే... ఇప్పట్లో రాదు: సీఎం కేసీఆర్

కరోనా వస్తే అక్టోబర్‌లోనే... ఇప్పట్లో రాదు: సీఎం కేసీఆర్

వరంగల్: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఎత్తివేతపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వస్తే గిస్తే అక్టోబర్ తర్వాతే వస్తుందన్నారు. ఈ మధ్య కాలంలో రాదన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పేదలు ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్ ఎత్తేశామన్నారు. సగం జిల్లాల్లో నో కరోనా అన్నారు. వైద్యాధికారులతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సడలింపులు పెట్టినా వ్యాప్తి లేదని... ఇదే విషయాన్ని అధికారులు చెప్పారన్నారు. అవన్నీ చర్చించిన తర్వాతే లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ అన్నారు. అయినా విమర్శలు చేశారన్నారు.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

వాళ్లకే పట్టింపు ఉన్నట్టు ... తమకు లేనట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విమర్శలు చేసే వారి విజ్ఞానానికే వదిలేస్తున్నామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy