తమిళనాడు సీఎం ఎడప్పాడి పిలుపు
చెన్నై, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 (కరోనా) వైరస్ విరుగుడుకి మందు కనిపెట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్ర వైద్యులు, పరిశోధకులకు పిలుపునిచ్చారు. ప్రపంచ బ్యాంక్ సహకారంతో రూ.857 కోట్ల వ్యయంతో ఆరోగ్యశాఖలో కొత్తగా చేపట్టనున్న ఐదేళ్ల ఆరోగ్య సంస్కరణల పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగా ఎడప్పాడి మాట్లాడుతూ.. వైద్యులు ఎన్నో వ్యాధులను అరికడుతున్నప్పటికీ కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయని, ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైర్‌సకు సరైన మందు కనిపెట్టాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు.
దానికోసం పరిశోధనలు సాగించాలని కోరారు.

