కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో మారుతి సుజుకి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మారుతి సుజుకి ఇండియా తన ప్లాంట్ల నిర్వహణ షట్ డౌన్ ను మే 16 వరకు పొడిగించినట్లు తెలిపింది. 2021 మే 9 వరకు ఉన్న మెయింటెనెన్స్ షట్ డౌన్ పొడిగించబడుతోందని, ప్రస్తుత మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ వద్ద ఉన్న ప్లాంట్లలో కొన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది.
